-
-
Home » Andhra Pradesh » formation Chemical Industry
-
దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం: యనమల
ABN , First Publish Date - 2020-12-10T14:43:49+05:30 IST
దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి యనమల రాయకృష్ణుడు ప్రకటించారు. గతంలో దీనిని వ్యతిరేకించినట్లు వైసీపీ నటించిందని విమర్శించారు.

విజయవాడ: దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. గతంలో దీనిని వ్యతిరేకించినట్లు వైసీపీ నటించిందని విమర్శించారు. దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ద్వారా.. వైసీపీ అసలు రంగు బయటపడిందన్నారు. సముద్ర జలాలన్నీ కలుషితమై.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.