నెల్లూరులో ఫారెన్‌ క్వారంటైన్‌ కోవిడ్‌ సెల్‌

ABN , First Publish Date - 2020-05-13T12:27:56+05:30 IST

నెల్లూరులో ఫారెన్‌ క్వారంటైన్‌ కోవిడ్‌ సెల్‌

నెల్లూరులో ఫారెన్‌ క్వారంటైన్‌ కోవిడ్‌ సెల్‌

నెల్లూరు: విదేశాల నుంచి వస్తున్న వారి కోసం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో ఫారెన్‌ క్వారంటైన్‌ కోవిడ్‌ సెల్‌ ప్రారంభమైంది. విదేశాల నుంచి నెల్లూరుకు వచ్చే వారు, విదేశాలకు వెళ్లే వారి వివరాలన్నీ ఈ సెల్‌లో నమోదు చేసుకుంటారని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ, క్వారంటైన్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.  ఇందుకోసంగా 20 మంది సిబ్బంది ఈ సెల్‌లో నిరంతర సేవలందిస్తారని, విదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 15,555 మంది జూన్‌ 15వ తేదీ లోపు వస్తున్నట్లు తెలిపారు.  వీరందరి వివరాలు సేకరించడంతోపాటు వారు విమానాశ్రయంలో దిగిన వెంటనే క్వారంటైన్‌కు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Read more