విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలోకి నీరు

ABN , First Publish Date - 2020-10-14T08:43:19+05:30 IST

భారీ వర్షాలు, వరదలకు గోదావరి జిల్లాల్లో కొన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ముంపునకు గురయ్యాయి. 132 కేవీ సబ్‌స్టేషన్..

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలోకి నీరు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలకు గోదావరి జిల్లాల్లో కొన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ముంపునకు గురయ్యాయి. 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఒకటి, 33 కేవీ సబ్‌స్టేషన్లు మూడు ముంపులో చిక్కుకొన్నాయని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే పెద్ద సంఖ్యలో 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ముంపునకు గురయ్యాయి. వరద ఉధృతి అధికంగా ఉన్నచోట పెద్ద సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. యుద్ధ ప్రాతిపదికన వీటికి మరమ్మతులు చేసి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కు చర్యలు తీసుకొన్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. సహాయక సిబ్బందిని, సామగ్రిని క్షేత్ర స్థాయికి పంపామని వివరించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థల ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. తీసుకొన్న చర్యలను విద్యుత్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరించారు.

Updated Date - 2020-10-14T08:43:19+05:30 IST