వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-09-29T08:02:05+05:30 IST

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోమవారం ఓ

వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

 సుజనా 


విజయవాడ సిటీ,  సెప్టెంబర్‌ 28: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోమవారం ఓ ప్రకటనలో  విమర్శించారు. కృష్ణానది వరదలతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో రైతులు వేలాది కోట్ల పంటలు నష్టపోయారని, లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

వీరందరికీ యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికీ రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-09-29T08:02:05+05:30 IST