వరద బాధితులకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-10-19T19:18:51+05:30 IST
అమరావతి: వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అమరావతి: వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులను సైతం జారీ చేసింది. వారానికి పైగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం.. కృష్ణా, గుంటూర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సత్వరమే చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది.