ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-08-16T21:20:33+05:30 IST

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 70 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 70 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  1.20 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. మున్నేరు, వైరా, కట్లేరు, విప్ల వాగు, కీసర నుంచి భారీగా వరద వస్తోంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్లిపోయే నీటి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజి పరివాహక ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు మరో మూడు రోజుల ఇదే విధంగా కొనసాగుతుందంటుని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-16T21:20:33+05:30 IST