ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-08-16T15:16:38+05:30 IST

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది.

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం

కృష్ణాజిల్లా: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 70 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1.10 లక్షల క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో 91 వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు తెలిపారు. మున్నేరు, వైరా, కట్లేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది.


కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, మునేరు, కట్టలేరు, వైరా ఏరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మున్నేరు నది ప్రమాదస్థాయిని మించి పరవళ్లు తొక్కుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగాల, పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు పొంగి నీరు బ్రిడ్జిలపైకి వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.

Updated Date - 2020-08-16T15:16:38+05:30 IST