ఫ్లిప్ కార్ట్ కార్గో వాహనంలో మంటలు
ABN , First Publish Date - 2020-10-01T18:24:37+05:30 IST
ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వాహనంలో మంటలు చెలరేగాయి.
శ్రీకాకుళం జిల్లా: ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వాహనంలో మంటలు చెలరేగాయి. పలాస మండలం, లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద పార్శిల్ లోడ్‌తో వెళుతున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే వాహనంలో ఉన్న వస్తువులు చాలా వరకు కాలిపోయాయి. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.