చీరాల సముద్ర తీరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-12T02:49:30+05:30 IST

చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వాడరేవు మత్స్యకారులపై కఠారివారిపాలెం

చీరాల సముద్ర తీరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ప్రకాశం: చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వాడరేవు మత్స్యకారులపై కఠారివారిపాలెం మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాడరేవు మాజీ సర్పంచ్ రమణతో పాటు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వాడరేవు మత్స్యకారుల ఇళ్ళు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. భయంతో వాడరేవు మత్స్యకారులు పరుగులు తీశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వాడరేవు, కఠారివారిపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. సముద్రంలో చేపల వేటకి బల్లవల వినియోగంపై వివాదం నెలకొంది.



Updated Date - 2020-12-12T02:49:30+05:30 IST