చీరాల సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-11T23:53:45+05:30 IST

చీరాల సముద్ర తీర ప్రాంతంలో మత్య్సకారుల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. వాడరేవు, కఠారివారి పాలెం మత్స్యకారులు ఒకరిపై ..

చీరాల సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత

ప్రకాశం: చీరాల సముద్ర తీర ప్రాంతంలో మత్య్సకారుల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. వాడరేవు, కఠారివారి పాలెం మత్స్యకారులు ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేపల వేటకు వలల వినియోగంపై వాడరేవు, కఠారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వాడరేవు మత్య్సకారులు బల్లవల వినియోగిస్తున్నారు. దీని వల్ల తమకు చేపలు చిక్కడం లేదంటూ కఠారివారిపాలెం మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చెలరేగింది. సముద్రంలో ఒకరి బోట్లను మరొకరు అడ్డుకున్నారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. 

Updated Date - 2020-12-11T23:53:45+05:30 IST