రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-21T00:28:58+05:30 IST

రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సాగు, తాగునీరు లేని దుర్భిక్ష ప్రాంతమని

రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలి: సోమిరెడ్డి

అమరావతి: రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సాగు, తాగునీరు లేని దుర్భిక్ష ప్రాంతమని, నికర జలాలైనా, వరద జలాలైనా సీమలో మొదటి పంటకు ఇవ్వాలన్నారు. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ అవకాశం కల్పించాలని చెప్పారు. గతేడాది పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల 10 రోజులు ఆలస్యం కావడంతో జలాలు సముద్రం పాలయ్యాయని పేర్కొన్నారు. జలాలు వృథాగా సముద్రంలో కలిస్తే ఏమొస్తుంది? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2020-08-21T00:28:58+05:30 IST