నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-05-11T02:44:55+05:30 IST

నగరంలోని బోడిగోడి తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు చెట్టు కొమ్మలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న కెమికల్ ఫ్యాక్టరీకి

నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం

నెల్లూరు: నగరంలోని బోడిగోడి తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు చెట్టు కొమ్మలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న కెమికల్ ఫ్యాక్టరీకి వ్యాపించాయి. మంటల్లో ఫ్యాక్టరీలోని కెమికల్స్  తగులపడుతుండటంతో విష వాయువులు వెలువడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-05-11T02:44:55+05:30 IST