గుంటూరులో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-11T12:40:59+05:30 IST

గుంటూరులో అగ్నిప్రమాదం

గుంటూరులో అగ్నిప్రమాదం

గుంటూరు:  జిల్లాలోని పిడుగురాళ్లలో సూర్యసెమ్  కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి కంపెనీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటల్లో ముడిసరుకు, పెయింట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సుమారు రూ.5కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.


Updated Date - 2020-05-11T12:40:59+05:30 IST