-
-
Home » Andhra Pradesh » FIR registered against Mariamma death
-
మరియమ్మ మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ABN , First Publish Date - 2020-12-30T08:37:24+05:30 IST
వెలగపూడి ఎస్సీ కాలనీలో రాళ్ల దాడి ఘటనలో 36 మందిపై హత్యానేరంతో పాటు పలు సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

తుళ్లూరు, డిసెంబరు 29: వెలగపూడి ఎస్సీ కాలనీలో రాళ్ల దాడి ఘటనలో 36 మందిపై హత్యానేరంతో పాటు పలు సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ నందిగం సురేష్ పోద్బలంతోనే రాళ్ల దాడి జరిగిందని మరియమ్మ కుమారుడు మెండెం బాబు ఫిర్యాదులో పేర్కొనగా, దానినే ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. కాగా, బాపట్ల ఎంపీ నందిగం సురే్‌షను ఎ-1గా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సోమవారం రాత్రి మరోసారి మరియమ్మ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. హోంమంత్రి సుచరిత అర్ధరాత్రి రెండో విడత వెలగపూడి వచ్చి చర్చలు జరిపారు. పోలీసులు విచారించి తగిన చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును అందజేశారు. ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేసి బాధితులకు అందజేయడంతో ఆందోళన విరమించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.