నిందారోపణతో ఎఫ్‌ఐఆర్ సరి కాదు: హైకోర్టు
ABN , First Publish Date - 2020-07-19T08:48:30+05:30 IST
పిటిషనర్‌పై నిందారోపణతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరి కాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరువు

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): పిటిషనర్‌పై నిందారోపణతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరి కాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో చల్లా రవి అనే వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక ఇప్పటికే పోలీసులు పిటిషనర్‌ను అరెస్టు చేసి ఉంటే పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేశారు.