వాహన మిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం: పేర్ని నాని

ABN , First Publish Date - 2020-05-18T16:57:17+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు భాగంగా మొదటి హామీ..

వాహన మిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం: పేర్ని నాని

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా మొదటి హామీ ‘వాహన మిత్ర’. ఆటో డ్రైవర్లు అందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ.. ఈ మూడింటికి సంబంధించి సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం ద్వారా 2,36,334 మందిని లబ్దిదారులుగా గుర్తించి వారికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. 


ఈ లబ్దిదారుల్లో బీసీకి చెందినవారు 1,5,932 మంది ఉండగా, ఎస్సీకి చెందినవారు 54,485 మంది, ఈబీసీ 13,091 మంది, కాపులు, 27,107, ఎస్టీలు 8,762, మైనార్టీ 25,517, బ్రాహ్మణులు 509, క్రిష్టియన్స్ 931 మంది లబ్దిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 4న ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ప్రారంభించారన్నారు. ఈ ఏడాది రెండో విడతగా జూన్ 4న వాహన మిత్ర ప్రాగ్రామ్‌ను సీఎం ప్రారంభిస్తారని నాని తెలిపారు. దీనికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26వ తేదీ లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గత సారి లబ్దిపొందినవారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. 


Updated Date - 2020-05-18T16:57:17+05:30 IST