సంక్షేమానికి మేము కేరాఫ్‌: బుగ్గన

ABN , First Publish Date - 2020-07-15T09:23:22+05:30 IST

తమ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. తమ పాలనలో ...

సంక్షేమానికి మేము కేరాఫ్‌: బుగ్గన

విజయవాడ, జూలై 14(ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. తమ పాలనలో ప్రజాసంక్షేమం లేని పథకం ఏముందో తెలపాలని టీడీపీని డిమాండ్‌ చేశారు.  మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన అప్పుల నుంచి ఏడాదిలో బయటపడలేమని చెప్పారు. తప్పుడు అంచనాలతో గణాంకాలను తయారు చేసి, రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని బుగ్గన అన్నారు. అయినా తాము ప్రజలకు మంచి చేస్తుంటే టీడీపీ నేతలకు కంటగింపుగా ఉందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2020-07-15T09:23:22+05:30 IST