ఆ బిల్లులను ఆమోదించండి!

ABN , First Publish Date - 2020-07-22T08:03:09+05:30 IST

ఏపీసీఆర్‌డీఏ చట్టం రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ(మూడు రాజధానులు) బిల్లులను ఆమోదించాలని..

ఆ బిల్లులను ఆమోదించండి!

గవర్నర్‌కు మంత్రి బుగ్గన అభ్యర్థన

నేడు విశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ భేటీ


అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఏపీసీఆర్‌డీఏ చట్టం రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ(మూడు రాజధానులు) బిల్లులను ఆమోదించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభ్యర్థించారు. ప్రభుత్వ దూతగా మంగళవారం ఆయన రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌తో భేటీ అయ్యారు. తాను ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ బిల్లులు ఆమో దం పొందేలా చూసే బాధ్యతను సీఎం జగన్‌ మంత్రి బుగ్గనకు అప్పగించినట్టు సమాచారం.  


నేడు సీఎం కూడా..

రాజ్‌భవన్‌లో బుధవారం జరిగే ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జంట బిల్లులపై చర్చించనున్నారని, వాటిని ఆమోదించాలని హరిచందన్‌ను సీఎం కోరనున్నారని తెలిసింది. 

Updated Date - 2020-07-22T08:03:09+05:30 IST