-
-
Home » Andhra Pradesh » Fighting on behalf of victims Shaylajnath
-
బాధితుల పక్షాన పోరు: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-05-13T09:45:36+05:30 IST
‘‘ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటనలో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా వారితో ఎయిర్‌పోర్టులోనే సీఎం మంతనాలు జరపడం విచారకరం.

గోపాలపట్నం(విశాఖ), మే 22: ‘‘ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటనలో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా వారితో ఎయిర్‌పోర్టులోనే సీఎం మంతనాలు జరపడం విచారకరం. బాధితులకు రూ.కోటి పరిహారం ఇస్తే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్ర తి విషయాన్ని వైసీపీ నేతలు డబ్బుతోనే ముడిపెడతారు’’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం వెంకటాపురం గ్రామాన్ని సంఐదర్శించారు. ‘‘12 మంది ప్రాణాలను తీసిన కంపెనీ యాజమాన్యంపై తీవ్రమైన కేసులు పెట్టలేదు. మెతకవైఖ రి ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుంది’’ అని శైలజానాథ్ అన్నారు.