ఫైబర్‌ ఆంజనేయ

ABN , First Publish Date - 2020-09-21T08:03:04+05:30 IST

ఇప్పటి వరకు సిమెంటు, రాతితో మాత్రమే భారీ విగ్రహాలు తయారు చేయడం చూశాం!. ఫైబర్‌ గ్లాసుతో విగ్రహాలు అరుదు. అయితే ఏకంగా..

ఫైబర్‌ ఆంజనేయ

ఇప్పటి వరకు సిమెంటు, రాతితో మాత్రమే భారీ విగ్రహాలు తయారు చేయడం చూశాం!. ఫైబర్‌ గ్లాసుతో విగ్రహాలు అరుదు. అయితే ఏకంగా.. 20 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేశారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర.


బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే దారిలో గల సాయి ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. 100 అడుగుల సిమెంట్‌ విగ్రహాలు ఇప్పటి వరకు ప్రతిష్ఠించడం చూశామని, ఇంత ఎత్తు గల ఫైబర్‌ గ్లాసు విగ్రహాలు ఇప్పటి వరకు ఎక్కడా రూపొందించలేదని తెలిపారు. విగ్రహా తయారీకి ఆరు నెలల కాల వ్యవధి పట్టిందని, ఇది 50 ఏళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని చెప్పారు.

-తెనాలి


Updated Date - 2020-09-21T08:03:04+05:30 IST