రైతుల ఇంటికే ఎరువులు

ABN , First Publish Date - 2020-12-13T08:59:50+05:30 IST

రైతుల ఇంటికే ఎరువులు

రైతుల ఇంటికే ఎరువులు

సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బాధ్యతలు


అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతుభరోసా కేంద్రాల నుంచి ఎరువులు, సూక్ష్మపోషకాలు, పశు దాణాలను రైతుల ఇంటికే సరఫరా చేసేందుకు గ్రామ వ్యవసాయ సహాయకులు, వలంటీర్ల బాధ్యతలపై ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్బీకేలకు ఎరువులు, సూక్ష్మపోషకాలు, పశు దాణాల పంపిణీకి ఏపీ మార్క్‌ఫెడ్‌ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. వీఏఏలు ఆర్బీకేలకు ఇన్‌చార్జిలుగా ఉంటారు. స్టాక్‌లో వ్యత్యాసాలు, వసూలు, చెల్లింపుల విషయంలో ఏదైనా తేడా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో హెచ్చరించారు. 

Updated Date - 2020-12-13T08:59:50+05:30 IST