ఏపీ వైసీపీలో గుబులు

ABN , First Publish Date - 2020-12-06T17:40:22+05:30 IST

హైదరాబాద్ గ్రేటర్ ఫలితాలు ఏపీలో గుబులు పుట్టిస్తున్నాయి.

ఏపీ వైసీపీలో గుబులు

అమరావతి: హైదరాబాద్ గ్రేటర్ ఫలితాలు ఏపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి చెందిన కొంతమంది నేతలు టీఆర్ఎస్‌కు మద్దతు పలికినట్టు వచ్చిన వార్తలతోపాటుగా కొన్ని సాక్ష్యాలను కూడా తెలంగాణ బీజేపీ నేతలు సేకరించారు. ఈ సమాచారాన్ని ఢిల్లీలోని బీజేపీ అధికాయకత్వానికి చేరవేశారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్నప్పటికీ కొంతమంది సహాయనిరాకరణ దోరణిపై కమలనాథులు ఆరా తీస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయింది. వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. అయితే తెలంగాణలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుద్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్‌కు ఎక్కువగా డివిజన్లు వచ్చాయి. 55 స్థానాల్లో మెజారిటీ డివిజన్లు టీఆర్ఎస్‌ ఈ నియోజకవర్గాల్లోనే గెలుచుకుంది. 


అయితే ఈ సక్సెస్ వెనుక ఏపీలోని అధికారపార్టీ సహకారం ఉందని తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం అందింది. కొంతమంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఏపీలో అధికారపార్టీ నేతల నుంచి ఫోన్లు వెల్లడమేకాకుండా తెలంగాణలోని టీఆరఎస్‌కు ఇవ్వాలని సూచించినట్లుగా సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వకపోతే ఆంధ్రాలో ఉన్న మూలాలు.. తమవారికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో సీమాంధ్రులు ఎక్కువమంది టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ డివిజన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుందని విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2020-12-06T17:40:22+05:30 IST