దారుణం: తండ్రి మృతదేహానికి కన్నకొడుకుతో కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-07-28T03:33:57+05:30 IST
రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణం జరిగింది. రేవులగడ్డ ప్రసాద్ (52) అనే వ్యక్తి గుండెపోటుతో..

ఏలూరు: రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణం జరిగింది. రేవులగడ్డ ప్రసాద్ (52) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అయితే మృతదేహం నుంచి శ్వాబ్ నమూనాలను కొడుకు రవికుమార్‌తో ఆరోగ్య శాఖ సిబ్బంది తీయించారు. దీంతో వైద్య సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కొడుకుతో కరోనా టెస్ట్ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.