రైతులు నష్టపోకుండా పొగాకును కొనుగోలు చేయాలి: జగన్‌

ABN , First Publish Date - 2020-04-26T21:30:00+05:30 IST

రైతులు నష్టపోకుండా పొగాకును కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున...

రైతులు నష్టపోకుండా పొగాకును కొనుగోలు చేయాలి: జగన్‌

అమరావతి: రైతులు నష్టపోకుండా పొగాకును కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున... టంగుటూరు, కొండపిలో ప్రత్యామ్నాయ వేలంపాట కేంద్రాలు ఏర్పాటు చేశామని  చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ వేలం పాటలు నిర్వహించాలని, సోమవారం నుంచి వేలం పాటలు నిర్వహించాలని అధికారులకు జగన్‌ ఆదేశించారు. కరోనా నుంచి కోలుకున్నవారికి రూ.2 వేలు ఇస్తున్నామని జగన్ చెప్పారు.

Updated Date - 2020-04-26T21:30:00+05:30 IST