గుంటూరులో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2020-03-02T18:41:09+05:30 IST
గుంటూరులో రైతుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెంలో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాలను భూసేకరణ కోసం తీసుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. బలవంతంగా భూమిని తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.