తుళ్లూరులో కొనసాగుతున్న రైతుల నిరసన

ABN , First Publish Date - 2020-12-07T14:54:08+05:30 IST

అమరావతి: తుళ్లూరులో రైతుల నిరసన కొనసాగుతోంది. దీంతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

తుళ్లూరులో కొనసాగుతున్న రైతుల నిరసన

అమరావతి: తుళ్లూరులో రైతుల నిరసన కొనసాగుతోంది. దీంతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తుళ్ళూరులో రోడ్డుపై ఆందోళన విరమించాలని రైతులకు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో నిన్న సాయంత్రం జరిగిన ఘటనకు నిరసనగా గత రాత్రి నుంచి రోడ్డుపై కూర్చొని అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. దీక్షా శిబిరంలో ఆందోళన చేసుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా.. రోడ్డుపై నుంచి కదిలేది లేదని అమరావతి రైతులు స్పష్టం చేస్తున్నారు. నిన్న ఉద్దండరాయునిపాలెం రైతులపై దాడి చేసిన మూడు రాజధానుల వారిపై కేసులు పెట్టాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు.


 ఎక్కడి నుంచో వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వాపోయారు. 


తమ భూముల్లో వాళ్ళు మూడు రాజధానుల ధర్నాలు చేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-12-07T14:54:08+05:30 IST