మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకనే రైతు ఉద్యమం: కన్నాలక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2020-12-25T18:11:48+05:30 IST

మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకనే రైతు ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నాయకులు డ్రామాలు ఆడుతున్నారని

మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకనే రైతు ఉద్యమం: కన్నాలక్ష్మీనారాయణ

గుంటూరు: ప్రధానమంత్రి మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకనే రైతు ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నాయకులు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేత కన్నాలక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రైతులపై ముసలీ కన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాందీ పలికారని స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లులు అమల్లోకి వస్తే రైతే రాజు అవుతారని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ల‌లోదళారుల వ్యవస్థకు చెక్ పెట్టేందుకు మోదీ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని కన్నాలక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-25T18:11:48+05:30 IST