అవి రాజధాని కోసం రైతులిచ్చిన భూములు!

ABN , First Publish Date - 2020-03-13T08:24:21+05:30 IST

‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే మీ (ప్రభుత్వం) జేబు నుంచి ఇవ్వండి. అంతే తప్ప రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇవ్వడం సరి కాదు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం...

అవి రాజధాని కోసం రైతులిచ్చిన భూములు!

  • ఇళ్ల స్థలాల కోసం మీ జేబులోంచి ఇవ్వండి
  • రాజధాని భూములిచ్చే అధికారం మీకు లేదు
  • అభివృద్ధి పనులు మరిచి... పంపిణీయా?
  • చట్ట నిబంధనల అతిక్రమణను అనుమతించం


అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే మీ (ప్రభుత్వం) జేబు నుంచి ఇవ్వండి. అంతే తప్ప రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇవ్వడం సరి కాదు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ ముందస్తు ప్రణాళిక ప్రకారం రాజధాని అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా... ఆ విషయాన్ని వదిలేసిన ప్రభుత్వం, సమీకరించిన భూమిలో 5 శాతాన్ని ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించింది.


రాజధానిలో ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఐదేళ్ల తరువాత ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను దాటవేస్తోందని... దీనిని అనుమతించలేమని ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 1251 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ గత 25వ తేదీన జారీ చేసిన జీవో 107ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, అశోక్‌భాన్‌, న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపించారు.


Updated Date - 2020-03-13T08:24:21+05:30 IST