నేడు రైతు దినోత్సవం

ABN , First Publish Date - 2020-07-08T08:03:54+05:30 IST

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నేడు రైతు దినోత్సవం

  • పలు కార్యక్రమాలకు సీఎం జగన్‌ శ్రీకారం 

అమరావతి, జులై 7(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. సున్నా వడ్డీ పథకం కింద రైతులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌, చెరకు రైతులకు బకాయిలు విడుదల చేస్తారు. నైరా, సామర్లకోట, తంగడంచలో వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలకు శంకుస్థాపన, రైతు భరోసా మాసపత్రిక ఆవిష్కరణ, కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ ప్రారంభం, పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ సేవల ప్రారంభం, 8ఫిషింగ్‌ హార్బర్ల, 4ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణంపై ఒప్పందం వంటి కార్యక్రమాలు చేపడతారు. 

Updated Date - 2020-07-08T08:03:54+05:30 IST