రైతులకు ఏపీ ప్రభుత్వం ఝలక్‌

ABN , First Publish Date - 2020-03-02T15:36:59+05:30 IST

ఏపీ ప్రభుత్వం రైతులకు ఝలక్‌ ఇచ్చింది. పంట రుణాలపై ప్రభుత్వ నూతన విధానం రైతు లను కంగుతినిపించింది. రైతుల శ్రేయస్సు కోసం పాటు

రైతులకు ఏపీ ప్రభుత్వం ఝలక్‌

  • ఒకచేతితో ఇస్తూ మరోచేతితో లాక్కొంటూ...
  • పంట రుణాల వడ్డీ రాయితీకి మంగళం
  • నూటికి 60పైసలు వడ్డీ చెల్లించాల్సిందే
  • పావలా వడ్డీకి సర్కార్‌ స్వస్తి
  • అన్నదాతలపై ఆర్థికభారం

గుంటూరు: ఏపీ ప్రభుత్వం రైతులకు ఝలక్‌ ఇచ్చింది. పంట రుణాలపై ప్రభుత్వ నూతన విధానం రైతు లను కంగుతినిపించింది. రైతుల శ్రేయస్సు కోసం పాటు పడుతున్నామని రైతుభరోసా పథకా న్ని అమలు చేస్తూ ప్రతి రైతు కటుంబానికి ఏటా రూ.13,5 00 అందిస్తూన్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇదే సమయంతో రైతుల నడ్డి విరిగేలా పంటరుణాలపై వడ్డీ రాయితీని రద్దుచేసింది. పావలా వడ్డీకి మంగళం పాడింది. ఒక చేతితో రైతు భరోసా ఇస్తూ మరో చేతితో వడ్డీ రాయితీ రద్దుచేసి రైతుల వద్ద నుం చి డబ్బు లాక్కుంటున్నది. జిల్లాలో లక్షలాది మంది రైతు లపై ప్రభుత్వం అర్థిక భారాన్ని మోపింది. వడ్డీ రాయితీ రద్దు చేయడంపై అన్నదాతలు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో 4 లక్షల మందిపైగా రైతులు వివిధ బ్యాంకుల నుంచి పంటరుణాలు పొందారు. ఒక్క సహకార బ్యాంకుల లోనే 1.15 లక్షల మంది రైతులు పంట రుణాలు పొందారు. గత ఎనిమిది ఏళ్ళ నుంచి పంట రుణాలపై అమలుచేస్తున్న పూర్తిగా వడ్డీ రాయితీ, పావలా వడ్డీ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. వీటికి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలికింది.  రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తం ఈ పథకాల నిలిపివేతతో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసుకుంటున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 పంట రుణాలపై ఒక లక్ష లోపు జీరో వడ్డీని ప్రభుత్వం అమలుచేసింది. లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు పంట రుణాలకు పావలావడ్డీని అమలుచేసేది. ఈ రెండింటిని ప్రభుత్వం విరమించుకొన్నది. దీంతో రైతులపై అదనంగా ఆర్థికభారం పడతున్నది. లక్షలోపు పంటరుణాలపై ఉన్న వడ్డీ రాయితీని రద్దుచేయడంతో రైతులు తీసుకొన్న లక్షలోనూ అప్పునకు 7శాతం వడ్డీ చెల్లించాలి. అంటే నూటికి 60 పైసలు వడ్డీ చెల్లించాల్సి ఉంది. లక్ష దాటిన 3 లక్షల రూపాయల లోపు రుణాలకు ఉన్న పావలా వడ్డీవిధానాన్ని రద్డు చేయడంతో సదరు రైతులు కూడా 7శాతం వడ్డీ చెల్లించాలి. నిర్ణీత గడువులోపు తీసుకొన్న రుణం తీర్చకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాలి. ఇలా రైతులపై పంట రుణాల వడ్డీ భారం పడుతున్నది. 


సహకార సొసైటీల ద్వారా రైతులు పొందిన రుణాలను వసూళ్ళ చేసేందుకు సదరు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో రైతువర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సొసైటీల కార్యదర్శులు, ప్రస్తుత పాలక వర్గాలు, రైతులు రెండు రోజుల క్రితం నరసరావుపేట శాసన సభ్యుడిని కలసి పాత పద్ధతిలోనే వడ్డీరాయితీ, పావలావడ్డీ పథకాలను అమలుచేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీఇచ్చారు. వడ్డీ రాయితీ, పావలా వడ్డీ పథకాలను నిలిపివేయడం దారుణ మని రైతులు వాపోతున్నారు. ఈ రెండు పథకాలను అమ లుచేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పథకాలు కొనసాగించకపోతే రైతు భరోసా సొమ్ము రుణాల వడ్డీకి కూడా సరిపోదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.   

Updated Date - 2020-03-02T15:36:59+05:30 IST