రైతు కష్టం నేలపాలు
ABN , First Publish Date - 2020-04-05T08:49:22+05:30 IST
కరోనా ప్రభావం రాష్ట్రంలో వ్యసాయ రంగంపైనా పడింది. వివిధ పంటలు కనీసం కోత, సేకరణకు కూడా నోచక పంట చేలలోనే కుళ్లి పాడైపోతున్నాయి. ఈ చిత్రాలు అవే. మొదటిది... కర్నూలు జిల్లా గార్గేయపురంలో రవాణా లేక, కొనుగోలుదారులు రాక,

కరోనా ప్రభావం రాష్ట్రంలో వ్యసాయ రంగంపైనా పడింది. వివిధ పంటలు కనీసం కోత, సేకరణకు కూడా నోచక పంట చేలలోనే కుళ్లి పాడైపోతున్నాయి. ఈ చిత్రాలు అవే. మొదటిది... కర్నూలు జిల్లా గార్గేయపురంలో రవాణా లేక, కొనుగోలుదారులు రాక, క్యాబేజీ పంటను వృథాగా వదిలేశారు. రెండోది.. కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతంలో కాయలు ముదిరిపోతున్నా అరటి గెలలు కోతకు నోచుకోవడంలేదు. ఇక మూడోది.. గుంటూరు జిల్లా దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో బొప్పాయి కోతకు వచ్చినా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎగుమతులు లేకుండా పోయాయి. పండ్లు పక్వానికి వచ్చినా సేకరించకపోవడంతో ఇలా నేలపాలవుతున్నాయి.