కలెక్టరేట్‌లో పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-03-02T19:14:17+05:30 IST
కర్నూలు: స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్‌కు హాజరైన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కర్నూలు: స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్‌కు హాజరైన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. సుధాకర్ అనే వ్యక్తి లింగాలలో ఉన్న తన భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరు మీద నమోదు చేశారని మనస్తాపానికి గురయ్యాడు. నేడు స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు వెళ్లాడు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.