రైతు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన

ABN , First Publish Date - 2020-06-22T20:01:24+05:30 IST

చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.

రైతు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన

చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద వరి ధాన్యాన్ని కింద పోసి రోడ్డుపై బైఠాయించి రైతు సంఘం నాయకుడు వెంకటాచలం నాయుడు నిరసన తెలిపారు. జిల్లా అధికారులు ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, సాధారణ రకం వరిధాన్యాన్నీ కొనుగోలు చేయడకుండా కేంద్రాలను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. చిత్తూరు పాల డైరీని సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వెంకటాచలం నాయుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-06-22T20:01:24+05:30 IST