-
-
Home » Andhra Pradesh » Farmer Drohi Jagan Keshineni Nani
-
రైతు ద్రోహి జగన్: కేశినేని నాని
ABN , First Publish Date - 2020-12-27T19:35:49+05:30 IST
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమని టీడీపీ నేత కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

కృష్ణా: అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమని టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వారికి రక్షణ కల్పిచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. మైనార్టీల, రైతు ద్రోహి సీఎం జగన్‌రెడ్డి అని ఆరోపించారు. అమరావతి రాజదానిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. మూడు రాజధానుల వాదన సీఎం జగన్ అనాలోచిత నిర్ణయమన్నారు. వైసీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.గుప్పెడు మట్టితో రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. చేతకానితనాన్ని ఒప్పుకోలేక మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని కేశినేని నాని పేర్కొన్నారు.