రైతు దినోత్సవం కాదు..: నిమ్మల రామానాయుడు

ABN , First Publish Date - 2020-07-08T15:56:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దినోత్సవం పేరున ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని..

రైతు దినోత్సవం కాదు..: నిమ్మల రామానాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దినోత్సవం పేరున ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అయితే రైతు దినోత్సవం కాదని, రైతుకు జరుగుతున్న మోసం, దగా, ద్రోహం అని రాష్ట్రంలో రైతులంతా భావిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో రైతులకు చేసింది జీరో అని విమర్శించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు రూ. 12,500 ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటతప్పారని, రూ. 7,500 ఇస్తున్నారని ఆరోపించారు. అంటే ఐదేళ్ల జగన్ పాలనలో ప్రతి రైతు రూ. 25వేలు నష్టపోతున్నారని రామానాయుడు అన్నారు. ఈ పరిస్థితిలో రైతు దినోత్సవం చేసుకునే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-07-08T15:56:52+05:30 IST