రైతు కష్టం.. రోడ్డు పాలు

ABN , First Publish Date - 2020-07-19T08:36:26+05:30 IST

నిమ్మ రైతులకు కరోనా కష్టాలు తెచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 1.36 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వస్తుంది. దీనిని పట్నా, గయ, వారాణసి, కలకత్తా, భువనేశ్వర్‌ తదితర

రైతు కష్టం.. రోడ్డు పాలు

జంగారెడ్డిగూడెం: నిమ్మ రైతులకు కరోనా కష్టాలు తెచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 1.36 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వస్తుంది. దీనిని పట్నా, గయ, వారాణసి, కలకత్తా, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. కరోనా కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. స్థానికంగా పెద్దగా డిమాండ్‌ లేదు. కిలో నిమ్మ నాలుగైదు రూపాయలకు అడుగుతున్నారు. ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. చెట్లు పాడైపోతాయని కొంతమంది రైతులు కాయలు కోసి రోడ్ల పక్కన పడేస్తున్నారు. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన శనివారం కనిపించిన నిమ్మకాయలు ఇవి.

Updated Date - 2020-07-19T08:36:26+05:30 IST