నెల్లూరులో నకిలీ శానిటైజర్లు

ABN , First Publish Date - 2020-06-19T09:46:29+05:30 IST

నకిలీ శానిటైజర్లు తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్న వారి గుట్టు రట్టయింది.

నెల్లూరులో నకిలీ శానిటైజర్లు

ఔషధ నియంత్రణ శాఖ తనిఖీల్లో 500 బాటిళ్లు స్వాధీనం


నెల్లూరు వైద్యం జూన్‌ 18: నకిలీ శానిటైజర్లు తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్న వారి గుట్టు రట్టయింది. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వలపన్ని 500 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని సంతపేట కామాక్షి నగర్‌లో మాక్స్‌క్లిన్‌, బొమ్మిస్‌ మెడికల్‌ డిస్ర్టిబ్యూటర్స్‌ పేరుతో, ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బండారుపల్లి’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ శానిటైజర్లు తయారవుతున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా శానిటైజర్లకు డిమాండ్‌ ఉండటంతో బొమ్మి శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ నకిలీ తతంగానికి తెర తీశారు. తన శానిటైజర్లకు మార్కెట్‌ పెరిగేలా సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు. ఓఎల్‌ఎక్స్‌ లోనూ ఈ బ్రాండ్‌లు ఉంచడంతో ఔషధ నియంత్రణ అధికారులు ఆరా తీయగా శానిటైజర్ల తయారీకి అనుమతులు లేవని తేలింది. ఈ ఉత్పత్తులపై తప్పుడు జీఎ్‌సటీ నంబరును ముద్రించినట్లు గుర్తించారు. 3నెలలుగా ఈ వ్యాపారం జరుగుతున్నట్టు గుర్తించిన ఆ శాఖ ఏడీ వీరకుమార్‌రెడ్డి గురువారం దాడిచేసి శానిటైజర్లను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేయనున్నట్లు ఏడీ చెప్పారు.

Updated Date - 2020-06-19T09:46:29+05:30 IST