-
-
Home » Andhra Pradesh » Failure in inter exams Student suicide
-
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-22T09:17:22+05:30 IST
: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనప్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కృష్ణాజిల్లాలో జరిగింది.

- ప్రభుత్వ ప్రకటనకు కొన్ని గంటలముందు ఘటన
గుడివాడ(రాజేంద్రనగర్), జూన్ 21: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనప్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. గుడివాడ వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ధనియాలపేటకు చెందిన రాజులపాటి పావని(17) పట్టణంలోని ఓ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో అన్ని సబ్జెక్లుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
దీంతో శనివారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. గుడివాడ ఏరియా ఆసుపత్రికి అక్కడ నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. పావని ఆత్మహత్య చేసుకున్న కొంత సమయానికి రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించడంతో కొద్ది గంటలు ఆగితే పావని బతికి ఉండేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.