-
-
Home » Andhra Pradesh » faction politics in state says kala venkata rao
-
రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు: కళా
ABN , First Publish Date - 2020-03-13T10:56:16+05:30 IST
రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు రాజాంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నాయకులు పరిహాసం చేస్తున్నారని...

రాజాం రూరల్, మార్చి 12: రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు రాజాంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నాయకులు పరిహాసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకులు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడిని ఖండించారు. వైసీపీలో దళిత ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధం ప్రకారం వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఓటేసి గెలిపించాలని కోరారు.