పనుల ఒత్తిడితోనే ఎఫ్‌ఏసీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-12-15T09:28:16+05:30 IST

కొంత మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పదోన్నతులు కోర్టు ఆదేశాల తో ఆగాయని, పనుల ఒత్తిడి కారణంగా

పనుల ఒత్తిడితోనే ఎఫ్‌ఏసీ ఏర్పాట్లు

‘ఆంధ్రజ్యోతి’ వార్తకు పీఆర్‌ స్పందన


అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కొంత మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పదోన్నతులు కోర్టు ఆదేశాల తో ఆగాయని, పనుల ఒత్తిడి కారణంగా వారిని ఎఫ్‌ఏసీతో నియమించామని పంచాయతిరాజ్‌ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ‘పైసలిస్తేనే పదోన్నతులు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తపై ఆయన స్పందించారు. 14 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు 2019-10 ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు పొందేందుకు ఆమోదం పొందారన్నారు. కోర్టులో కేసు ఉండడంతో ఈ ఇంజనీర్లకు రెగ్యులర్‌ పదోన్నతులు కల్పించలేదన్నారు. పని భారంవల్ల ఎఫ్‌ఏసీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 

Updated Date - 2020-12-15T09:28:16+05:30 IST