ఎంసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2020-10-28T08:26:42+05:30 IST

ఏపీ ఎంసెట్‌-ఎంపీసీ స్ట్రీమ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ను పొడిగించారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ గడువును నవంబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు

ఎంసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ పొడిగింపు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంసెట్‌-ఎంపీసీ స్ట్రీమ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ను పొడిగించారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ గడువును నవంబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఎంఎం నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని హెల్ప్‌లైన్‌ సెంటర్లు(హెచ్‌ఎల్‌సీ) పనిచేస్తాయని పేర్కొన్నారు. ఆప్షన్ల ఎంట్రీ కోసం నవంబరు 2 లేదా 3వ వారంలో షెడ్యూల్‌ విడుదల చేస్తామన్నారు. రిజిస్టర్‌ కాని అభ్యర్థులను వెబ్‌ ఆప్షన్ల ఎంట్రీ సమయంలోనూ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అనుమతిస్తామని, హెల్ప్‌లైన్‌ సెంటర్లు కూడా పనిచేస్తాయని వివరించారు. ఆప్షన్ల ఎంట్రీపై సూచనలు, ఇతర వివరాల కోసం https://apeamcet.nic.in  వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు. బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సులకు మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించవచ్చు. https://apeamcet.nic.in  వెబ్‌సైట్‌లో ‘పే ప్రాసెసింగ్‌ ఫీ’ లింకు ద్వారా చెల్లించాలి. 

Updated Date - 2020-10-28T08:26:42+05:30 IST