-
-
Home » Andhra Pradesh » exams
-
రేపు.. ఏపీ సెట్
ABN , First Publish Date - 2020-12-19T11:40:22+05:30 IST
రేపు.. ఏపీ సెట్

రాష్ట్ర వ్యాప్తంగా 76 కేంద్రాలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఏయూ క్యాంప్‌స(విశాఖ): రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామకానికి సంబంధించిన అర్హత పరీక్ష(ఏపీసెట్-2020)ను ఆదివారం(ఈ నెల 20) నిర్వహిస్తున్నట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 76 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీసెట్.నెట్.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని.. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు.