మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తి
ABN , First Publish Date - 2020-08-02T03:30:48+05:30 IST
అధికార లాంఛనాలతో మాజీమంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు తాడేపల్లిగూడెంలోని ..

ఏలూరు: అధికార లాంఛనాలతో మాజీమంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశానవాటికలో పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, పోలీస్ అధికారులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.