సీఎం జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2020-08-23T03:22:53+05:30 IST
మీడియా పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. మీడియాపై వైసీపీ ప్రభుత్వ తీరు
అమరావతి: మీడియా పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. మీడియాపై వైసీపీ ప్రభుత్వ తీరు గొడ్డలిపెట్టులా మారిందని దుయ్యబట్టారు. జగన్‌కు సొంత మీడియాపై ఉన్న ప్రేమ మిగిలిన పత్రికలు, చానళ్లపై లేదని ఆరోపించారు. ప్రకటనల జారీ విషయంలో వివక్ష చూపడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ప్రభుత్వం తీరును కళా వెంకట్రావు తూర్పారబట్టారు.