‘మంత్రులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు’

ABN , First Publish Date - 2020-10-07T17:32:10+05:30 IST

రాష్ట్ర మంత్రుల వైఖరిపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రులు తమ స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వారిని చూస్తేనే ప్రజలు

‘మంత్రులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు’

అమరావతి: రాష్ట్ర మంత్రుల వైఖరిపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రులు తమ స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వారిని చూస్తేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆరోపించారు. మంత్రి గుమ్మనూరు జయరాం బెంజ్ కారు విషయంలో ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేదన్నారు. మంత్రి జయరాం 400 ఎకరాలకు పైగా భూ దోపిడీ పాల్పడిన విషయాన్ని కూడా ఆధారాలతో సహా వెల్లడించామని అమరనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే బూతులు తిట్టి, దాడులు చేసి, పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తప్పులను ఎత్తి చూపిన వాళ్ల ఇళ్లను కూల్చే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం మొదలైందన్నారు. వైసీపీ వాళ్లు జైలుకు వెళ్లారని.. అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారంటూ అమరనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వైసీపీ అవినీతికి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు.

Read more