అందరూ ఉన్నా అనాథలా...!

ABN , First Publish Date - 2020-07-20T07:52:53+05:30 IST

నెల్లూరుకు చెందిన దంపతుల్లో ఇటీవల భర్తకు కరోనా సోకింది. ఆయన నారాయణ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నారు.

అందరూ ఉన్నా అనాథలా...!

రోడ్డుమీదే కరోనా బాధితురాలు

ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు

‘ఏబీఎన్‌’ కథనంతో కదలిక


 నెల్లూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు చెందిన దంపతుల్లో ఇటీవల భర్తకు కరోనా సోకింది. ఆయన నారాయణ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నారు. భార్యకు కూడా పాజిటివ్‌ వ చ్చినట్లు శుక్రవారం నిర్థారించారు. దీంతో ఆమె నారాయణ ఆస్పత్రికి వెళ్లగా పడకలు లేవని పంపేశారు. వారుంటున్న అపార్టుమెంట్‌కు వెళితే చుట్టుపక్కల వారు రావొద్దన్నారు. దగ్గరలోని అత్తగారింటి కి వెళ్లగా ఆమె కూడా కొవిడ్‌ భయంతో కోడలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బాధితురాలు ఆ ఇంటి బయటే 2 రోజులుగా రోడ్డుమీదే ఉండాల్సి వచ్చిం ది. ఆమె దీనస్థితిపై ‘ఏబీఎన్‌’ చానల్‌లో కథనం ప్రసారమడంతో అధికారులు ఆదివారం రాత్రి బాధితురాలిని నారాయణ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-07-20T07:52:53+05:30 IST