ఎవడబ్బ సొమ్మని.. టీటీడీ నిధులు తరలిస్తారు

ABN , First Publish Date - 2020-09-21T08:04:26+05:30 IST

‘టీటీడీ నిధులను బాండ్ల రూపంలో తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడబ్బ సొమ్మని తరలిస్తారు.

ఎవడబ్బ సొమ్మని.. టీటీడీ నిధులు తరలిస్తారు

మాజీ మంత్రి అమరనాథరెడ్డి 


తిరుపతి (రవాణా), సెప్టెంబరు 20: ‘టీటీడీ నిధులను బాండ్ల రూపంలో తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడబ్బ సొమ్మని తరలిస్తారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి’ అని మాజీమంత్రి అమరనాథరెడ్డి డిమాం డ్‌ చేశారు. తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేలా బోర్డు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదివారం అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసి, డిక్లరేషన్‌ వివాదంపై నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా అమరనాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తాను క్రిస్టియన్‌ అని చెప్పుకొనే సీఎం తిరుమల దర్శనానికి వస్తే డిక్లరేషన్‌ అవసరం లేదంటారా? దీన్నిబట్టి చూస్తే కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే సీఎం హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంద’ని విమర్శించారు.


Updated Date - 2020-09-21T08:04:26+05:30 IST