ఈఎస్ఐ స్కామ్‌: మాజీ మంత్రి పితాని పీఎస్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-10T20:06:57+05:30 IST

ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్‌ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు

ఈఎస్ఐ స్కామ్‌: మాజీ మంత్రి పితాని పీఎస్‌ అరెస్ట్

అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్‌ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురళీమోహన్.. పితాని సత్యనారాయణకు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా మురళీ మోహన్ పనిచేస్తున్నారు. ఈ ఉదయం సచివాలయంలో మురళిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-07-10T20:06:57+05:30 IST