ఎన్‌డీబీ పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్!
ABN , First Publish Date - 2020-06-25T08:22:15+05:30 IST
రాష్ట్రంలో న్యూడెవల్‌పమెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ఆర్థిక సాయంతో చేపట్టే రహదారుల పనులు..

అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో న్యూడెవల్‌పమెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ఆర్థిక సాయంతో చేపట్టే రహదారుల పనులు, వంతెనల మరమ్మతులకు సంబంధించి చేపట్టే కొనుగోళ్లకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానం వర్తింపజేసేందుకు సర్కారు అనుమతించింది. రివర్స్ టెండర్ విధానం కూడా ఇదే ఫార్మాట్‌లో వర్తింపజేస్తారు.