‘ఎల్‌జీ’ పర్యావరణ ఉల్లంఘనలు
ABN , First Publish Date - 2020-05-17T10:17:12+05:30 IST
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

19న సమీక్షించనున్న కేంద్రం
న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉల్లంఘనలపై సమీక్షించాలని నిర్ణయించింది. వివిధ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై ఈ నెల 18, 19 తేదీల్లో కేంద్ర ప ర్యావరణ శాఖకు చెందిన నిపుణుల కమిటీ(ఈఏసీ) వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించనుంది. ఏజెండాలో ఎల్‌జీ పాలిమర్స్ ప్రస్తావన కూడా ఉంది. ఈ సంస్థకు సంబంధించి న ఉల్లంఘనల అంశం 19వ తేదీ మధ్యా హ్నం చర్చకు రానుంది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంస్థకు చెందిన ప్రతినిధి సమావేశంలో పాల్గొనాలని ఈఏసీ ఎల్‌జీ సంస్థను ఆదేశించింది.